
టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్యపై మంత్రి టీజీ భరత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వైసీపీ నేతలు రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
హంద్రీనదిలో వైసీపీ కబ్జాలను బయటపెట్టినందుకే ఇంతియాజ్‌ను పక్కా పథకం ప్రకారం హత్య చేశారని మంత్రి సోమవారం మీడియాతో పేర్కొన్నారు.
కర్నూలులో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం చంద్రబాబుకు వివరిస్తానని, 1994-2004 మధ్య కాలంలో మాదిరిగానే ఫ్యాక్షనిజాన్ని అదుపులోకి తెస్తామని ఆయన హెచ్చరించారు.