
నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు సోషల్ మీడియా వీడియోలు చూసి రామగిరి బంగారు గనుల్లో బంగారం బిస్కెట్లు ఉంటాయని భ్రమపడ్డారు.
సోమవారం రాత్రి సమయంలో తాడు సాయంతో గనిలోకి దిగిన ప్రభాకర్రెడ్డి తాడు తెగిపోవడంతో లోపలికి పడిపోయి హాహాకారాలు చేశాడు.
స్థానికులు మరో తాడు సాయంతో అతన్ని బయటకు తీసి, పోలీసులకు అప్పగించడంతో పాటు మందలించి పంపారు.