
గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్ పొడిగింపు లభించింది.
పలాస కోర్టు అనుమతితో మంగళవారం కాశీబుగ్గ పోలీసులు అప్పలరాజును 4 గంటల పాటు విచారించి, ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు.
ప్రస్తుతం అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.