
భారత్‌కు పాకిస్థాన్ ప్రస్తుతం తక్షణ ముప్పుగా ఉన్నప్పటికీ, రాబోయే కాలంలో చైనానే ప్రధాన వ్యూహాత్మక పోటీదారుగా మారుతుందని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె తెలిపారు.
చైనాతో పోటీ కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, సైనిక రంగం వంటి అన్ని విభాగాల్లోనూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి పొరుగుదేశాల్లో స్థిరత్వం కూడా భారత భద్రతకు మరియు ప్రయోజనాలకు అత్యంత కీలకమని నరవణె స్పష్టం చేశారు.