
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి మరియు ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రాగల మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వర్షాలతో పాటు పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.