
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ పీ. విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు వెలువడే వరకు ఉపఎన్నిక నిర్వహించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.
ఈ మేరకు ఎన్నికల సంఘం (ఈసీ) అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
ఈ కేసు విచారణను అక్టోబర్ 6వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.