
భారత్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రభావం చూపే సొరంగాల తవ్వకానికి ఉపయోగించే టన్నెల్ బోరింగ్ యంత్రాల (టీబీఎం) ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు ప్రకటించింది.
జాతీయ భద్రత, ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ నియంత్రణలు విధిస్తున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ కొత్త ఆంక్షలు నవంబర్ 18 నుంచి అమల్లోకి రానుండటంతో భూగర్భ మెట్రో, హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం ఉంది.