జూన్ 10న గుంటూరులో అదృశ్యమైన పదో తరగతి బాలిక ఆచూకీని 24 గంటల్లో కనుగొనాలని ఆదేశించినా విఫలమైన పోలీసులపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడంపై జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ తుహిన్కుమార్ ధర్మాసనం డీజీపీని నేరుగా ప్రశ్నించింది.
బాలికను సోమవారం నాటికి కోర్టు ముందు హాజరుపరుస్తామని ఎస్జీపీ విష్ణుతేజ హామీ ఇవ్వడంతో, విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.