అదానీ ఎంటర్ప్రైజెస్ జులై-సెప్టెంబర్ త్రైమాసిక నికర లాభం రూ. 1,492 కోట్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన లాభాలు 55 శాతం తగ్గాయి.
కంపెనీ కార్యకలాపాల ఆదాయం 75 శాతం పెరిగి రూ. 37,216 కోట్లకు చేరుకుంది. మార్కెట్ లాభాల మధ్య అదానీ షేర్లు ఇంట్రాడేలో 6 శాతానికి పైగా ఎగబాకాయి.
లాభాలు తగ్గినప్పటికీ కోర్ ఆపరేటింగ్ పనితీరు మెరుగ్గా ఉండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.