
ఆస్ట్రేలియాలోని కియామా పబ్లిక్ లైబ్రరీ నుంచి 1870లో మిస్సైన 'యాంటీక్విటీస్ ఆఫ్ ఏథెన్స్' పుస్తకం 150 ఏళ్ల తర్వాత తిరిగి లైబ్రరీకి చేరింది.
ఒక వ్యక్తి తన ఇంటిని పునర్నిర్మిస్తుండగా ఫైర్ ప్లేస్‌లో ఈ పుస్తకం బయటపడగా, దానిపై ఆలస్య రుసుము కింద రూ. 19 లక్షల జరిమానా విధించారు.
లైబ్రరీ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారని, పుస్తకాన్ని తిరిగి ఇచ్చిన వ్యక్తి వివరాలు వెల్లడి కాలేదని లైబ్రరీ మేనేజర్ మిషేల్ హడ్సన్ తెలిపారు.