
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే వాదనలను ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తోసిపుచ్చారు.
ఏఐ పనులను సులభతరం చేస్తుందని, దీనివల్ల పనితీరు మెరుగుపడి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
అమెరికా ఈ ఏడాది ఏఐ మౌలిక సదుపాయాల కోసం ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని ఆయన వెల్లడించారు.