దసరా నవరాత్రుల ప్రత్యేక సేల్స్‌లో భాగంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఏజియో, మీషో వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో తొలి 2 రోజుల్లోనే సుమారు రూ. 24 వేల కోట్ల విలువైన వస్తువులు అమ్ముడయ్యాయి.
ఈ సీజన్‌లో మొదటి రెండు రోజుల్లో దాదాపు 8 నుంచి 9 కోట్ల వరకు ఆర్డర్లు నమోదయ్యాయని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అంచనా వేసింది.
మొత్తం విక్రయాలలో అత్యధికంగా మొబైల్ ఫోన్ల వాటా 38 నుంచి 40 శాతం వరకు ఉండగా, వాటి విలువ రూ. 9100 నుంచి రూ. 9600 కోట్ల మధ్య నమోదైంది.