
నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
నిందితుడి వద్ద సుమారు 40 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందగా, అతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
వన్‌టౌన్ సీఐ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుండగా, నిందితుడి పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.