
కృత్రిమ మేధ (ఏఐ) వల్ల మానవ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ పోలాండ్లోని వార్సాలో సుమారు 30 రోబోలు నిరసన చేపట్టాయి.
సోమవారం డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయం వద్ద జరిగిన ఈ ప్రదర్శనలో హ్యూమనాయిడ్ రోబోలు, రోబో కుక్కలు పాల్గొని కఠినమైన నిబంధనలు కావాలని డిమాండ్ చేశాయి.
మెమోక్రటిజం వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో అగిబోట్ ఏ3 వంటి అధునాతన యంత్రాలు కవాతు చేస్తూ ఏఐ ప్రభావంపై చర్చను లేవనెత్తాయి.