
జమ్మూ కశ్మీర్‌లోని బుద్గాం జిల్లా అష్దర్ గలి అటవీ ప్రాంతంలో భారత సైన్యం, పోలీసులు, సీఆర్పీఎఫ్ జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
సెప్టెంబర్ 4న జరిగిన ఈ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఒక ఏకే రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నాయి, హతమైన ఉగ్రవాదిని లష్కరే తొయిబా కమాండర్ యాసిర్‌గా గుర్తించారు.
అదే ప్రాంతంలో మరో ఉగ్రవాది నక్కి ఉన్నాడనే సమాచారంతో భద్రతా దళాలు అదనపు బలగాలతో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.