
ఆక్వా రంగానికి ఊతమిచ్చేలా త్వరలో ఫిష్ మీల్, ఫిష్ ఆయిల్ ధరలను 50 శాతం తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం తెలిపారు.
వైసీపీ హయాంలో ఆక్వా ఫీడ్ ధరలను ఆరు సార్లు పెంచారని, కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్ రాయితీని అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, భవిష్యత్తులో గొడ్డలి పార్టీల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.