
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 మూల్యాంకనంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు సిట్ తన తుది నివేదికను హైకోర్టుకు సమర్పించింది.
ఎంపికైన 165 మందిలో 160 మంది, ఎంపిక కాని 161 మందిలో 153 మంది జవాబు పత్రాల్లో మార్పులు జరిగినట్లు 7 ఫోరెన్సిక్ ల్యాబొరేటరీల డేటా ద్వారా వెల్లడైంది.
452 మంది నిపుణుల ప్యానల్‌ను పక్కనపెట్టి 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో మూల్యాంకనం చేయించారని, 173 మంది సాక్షుల వాంగ్మూలాలను సిట్ సేకరించింది.