
ఫ్లిప్‌కార్ట్ బెంగళూరులో 'ఈట్ ఇన్' పేరుతో ఫుడ్ డెలివరీ సేవలను ట్రయల్ రన్ చేస్తోంది.
జొమాటో, స్విగ్గీ వంటి దిగ్గజాలకు పోటీగా, ONDC సహాయంతో తక్కువ కమిషన్లతో ఈ సేవలను అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం అంతర్గతంగా పరీక్షిస్తున్న ఈ సేవలను త్వరలోనే సామాన్య వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.