
భారతదేశంలో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్)ను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ఆలోచిస్తోందని చైర్మన్ ఇంజేటి శ్రీనివాస్ వెల్లడించారు.
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రజల వద్ద ఉన్న దాదాపు 35,000 టన్నుల బంగారానికి ఆర్థిక విలువ చేకూరడంతో పాటు వార్షిక పసిడి దిగుమతులు 50 శాతం తగ్గే అవకాశం ఉంది.
ఈ డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు ఎన్‌ఎస్‌ఈ సంస్థ ఆగ్మెంట్ గోల్డ్ టెక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.