
డెంగ్యూ రోగుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్యను మేక పాలు వేగంగా పెంచుతాయనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్య నిపుణులు స్పష్టం చేశారు.
మేక పాలలో సెలీనియం, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఉన్నప్పటికీ, అవి డెంగ్యూ వైరస్‌ను నయం చేయలేవని వైద్యులు హెచ్చరించారు.
డెంగ్యూ సోకినప్పుడు రోగులు తగినంత నీరు, కొబ్బరి నీళ్లు తీసుకుంటూ, రోజువారీ సీబీపీ పరీక్షల ద్వారా ప్లేట్‌లెట్లను పర్యవేక్షించుకోవాలని సూచించారు.