
తెలంగాణ రాష్ట్రంలోని లక్ష మంది విద్యార్థులకు కృత్రిమ మేధ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక అంశాల్లో ఉచిత శిక్షణ అందించనున్నారు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) సహకారంతో 'తెలంగాణ ఏఐ అండ్ క్లౌడ్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్' కింద ఈ కార్యక్రమం అమలు కానుంది.
ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అర్హులైన విద్యార్థులకు ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.