
అస్సాం నగావ్ జిల్లాలోని 34వ బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఏఎస్ఐ బల్లాని ప్రేమబరం జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు.
మంగళవారం ఉదయం 7:00 గంటలకు జరిగిన ఈ ఘటనలో విష్ణు ప్రసాద్ బఘేల్, రామ్‌నవల్ సింగ్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు.
సహచరులపై కాల్పులు జరిపిన అనంతరం ఏఎస్ఐ ప్రేమబరం అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు.