
కాలిఫోర్నియాలో ఫెయిర్లెండ్ ఇంటర్ స్టేట్ 80 దగ్గర టెస్లా కారు ఆగిఉన్న హైవే పెట్రోలింగ్ పోలీసు వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది.
ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ మోడ్ ఆన్ చేసి డ్రైవర్ నిద్రపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు సోలానో హెచ్పీ అధికారులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు.