
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ దివాకర.ఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాల వసతులు, విద్యార్థులకు అందుతున్న ఆహారం, బోధన తీరును పరిశీలించిన కలెక్టర్, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం, రోడ్డు నిర్మాణం, సోలార్ విద్యుత్ కంచె వంటి ప్రతిపాదనలను తనకు పంపాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు.