
పశ్చిమాసియా యుద్ధం కారణంగా సరఫరా గొలుసులో ఏర్పడిన ఆటంకాలతో దేశంలో వంటగ్యాస్ కొరత తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ప్రజలకు ఎల్‌పీజీ కొరత లేకుండా చూసేందుకు దేశంలోని రిఫైనరీలకు ప్రత్యేక ఉత్పత్తి లక్ష్యాలను కేంద్రం నిర్దేశించింది.
సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా భవిష్యత్తులో గ్యాస్ కొరతను నివారించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.