
యెమెన్‌కు చెందిన హౌతీ బలగాల దాడులను అరికట్టడానికి కాల్పుల విరమణ ఒప్పందం నిమిత్తం సౌదీ అరేబియా 1 బిలియన్ అమెరికన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది.
సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ టెహ్రాన్‌కు వెళ్లి ఇరాన్ అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులతో ఈ విషయమై చర్చలు జరిపారు.
అయితే సైనిక బ్లాక్మెయిల్ ద్వారా రుద్దే ఎలాంటి కాల్పుల విరమణను అంగీకరించబోమని, యెమెన్ భూభాగాలను హౌతీలు వెనక్కి ఇచ్చేంతవరకు నిధులు బదిలీ చేయబోమని సౌదీ స్పష్టం చేసింది.