
ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టుపై నమీబియా క్రికెట్ జట్టు తొలిసారి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
ఐర్లాండ్‌తో విండ్‌హాక్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టును నమీబియా బౌలర్లు 33.1 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ చేశారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నమీబియా 21.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి, సిరీస్‌ను 3-2తో గెలుచుకుంది.