
ఇతరులు వదిలిన పొగను పీల్చడం వల్ల సంభవించే పరోక్ష ధూమపానం భారత్లో తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారుతోందని 'ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్' అధ్యయనం వెల్లడించింది.
2023లో భారత్లో సుమారు 3.25 లక్షల మంది పరోక్ష ధూమపానం కారణంగా మరణించగా, సుమారు 44.4 కోట్ల మంది ఈ పొగకు గురైనట్లు అంచనా.
ఈ పరోక్ష ధూమపానం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యల ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.