
క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ శనివారం ఉదయం 9.10 గంటలకు 78,588 డాలర్ల వద్ద ట్రేడవుతూ 80 వేల డాలర్ల మార్కుకు చేరువలో ఉంది.
గత 24 గంటల్లో 4.8 శాతం, గత వారంలో 24.5 శాతం లాభపడిన బిట్‌కాయిన్, 2023 మార్చి తర్వాత అత్యంత బలమైన వారపు ర్యాలీని నమోదు చేసింది.
అమెరికా ట్రెజరీ బాండ్ల బైబ్యాక్ ప్రకటన, స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల్లోకి బిలియన్ డాలర్లకు పైగా సంస్థాగత పెట్టుబడులు రావడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు.