
రాబోయే ఐదేళ్లలో అంతరిక్షంలో యుద్ధాలు చెలరేగే ప్రమాదం ఉందని బ్రిటన్లోని కింగ్స్ కాలేజీ నిపుణురాలు డాక్టర్ జూలియా బాల్మ్ హెచ్చరించారు.
ప్రస్తుతం జీపీఎస్, ఇంటర్నెట్, బ్యాంకింగ్ వంటి కీలక సేవలు ఉపగ్రహాలపై ఆధారపడి ఉండగా, వాటిని ధ్వంసం చేసే ఆయుధాలను పలు దేశాలు అభివృద్ధి చేస్తున్నాయి.
బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక అంతరిక్ష విభాగాన్ని ఏర్పాటు చేయగా, దేశాలు రక్షణ సామర్థ్యాలను పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.