
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
జులై నెలలో రాష్ట్రం 10.70 శాతం వృద్ధిని నమోదు చేసిందని, గుంతలు పడిన రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎల్నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, వాటిని అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు.