
రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతిరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత ప్రభుత్వ హయాంలో టీడీపీకి మద్దతిచ్చినందుకు వైసీపీ వేధింపులకు గురిచేసినా, సిద్ధాంతాలను వదలకుండా సేవలందించిన ఆమె ధైర్యాన్ని మెచ్చి ఈ నియామకం జరిగింది.
ఈ నియామకం ద్వారా మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.