భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్యగా పిలుస్తారని పండితులు తెలిపారు.
పితృతర్పణాలు వదిలేందుకు మధ్యాహ్నం 12 గంటల సమయం సరైనదని సూచించారు.
ఈ రోజు నువ్వులు కలిపిన నీటితో తర్పణాలు వదలడంతో పాటు దానాలు చేయడం శ్రేయసకరమని పేర్కొన్నారు.