దేశవ్యాప్తంగా పెరుగుతున్న H1N1 స్వైన్ ఫ్లూ కేసుల నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.
ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
జ్వరం, తుమ్ములు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.