
సీఎం చంద్రబాబు సోమవారం వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ప్రారంభించి, స్థానిక రైతులతో బటన్ నొక్కి నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేశారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది.
ప్రాజెక్ట్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం, ప్రాజెక్ట్ పైలాన్‌ను ఆవిష్కరించి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.