
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ₹5,000 ప్రోత్సాహకం లేదా ఉచిత డేటా పేరుతో వచ్చే నకిలీ లింక్‌లు, APK ఫైల్స్‌తో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
AI సాంకేతికతను ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలు, సింథటిక్ ఆడియో ద్వారా నమ్మదగిన వ్యక్తుల గొంతుతో డబ్బులు అడిగే ప్రమాదం ఉందని CERT-In హెచ్చరించింది.
ఏ ప్రభుత్వ పథకమైనా అధికారిక వెబ్సైట్లలో మాత్రమే నిర్ధారించుకోవాలని, తెలియని క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.