
ఎన్పీసీఐ ధృవీకృత టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ వియోనా ఫిన్‌టెక్ తన డిజిటల్ చెల్లింపుల టెక్నాలజీని ఆఫ్రికా దేశాలకు విస్తరించనుంది.
జింబాబ్వేలో వియోనా ట్యాప్ అండ్ పే ప్లాట్‌ఫారాన్ని ప్రవేశపెట్టేందుకు ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు సంస్థ తెలిపింది.
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లనే కాంటాక్ట్‌లెస్ పీఓఎస్లుగా మార్చుకునే ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ప్రయోజనం చేకూరనుంది.