
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
విశాఖ బుచ్చిరాజుపాలెంలో 9.17 సెం.మీ, విజయనగరం దత్తిరాజేరులో 8.62 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఆగస్టు 14న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో, శ్రీకాకుళం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.