
తెలంగాణలో ఆహార, ఔషధాల నాణ్యతను పర్యవేక్షించేందుకు ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలను విలీనం చేస్తూ 'టీజీ సేఫ్' అనే కొత్త సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ నూతన సంస్థకు కమిషనర్గా ఐపీఎస్ అధికారి అవినాశ్ మహంతిని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 మరియు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం-1940 నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేయడమే ఈ విలీనం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.