
పశ్చిమ బెంగాల్లో ఖరగ్పూర్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న బుష్రా బానోను ప్రభుత్వం బదిలీ చేసింది.
యూపీఎస్సీ అభ్యర్థులకు స్ఫూర్తినిచ్చేలా ఆమె పోస్ట్ చేసిన వీడియోలో మతపరమైన పదాలను ఉపయోగించడం వివాదానికి దారితీసింది.
ఈ వ్యవహారంపై హిందూ లీగల్ ఫండ్ సంస్థ హోం సెక్రటరీకి ఫిర్యాదు చేయగా, సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.