బంగారం ధరలు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటం మరియు ఆర్బీఐ నిబంధనల్లో మార్పుల కారణంగా దేశంలో గోల్డ్ లోన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
ఆర్బీఐ డేటా ప్రకారం బంగారు ఆభరణాలపై ఇచ్చిన రుణాలు 2024 జులైలో రూ. 1.24 లక్షల కోట్లుగా ఉండగా, 2026 జులై నాటికి రూ. 5.52 లక్షల కోట్లకు చేరాయి.
మొత్తం గోల్డ్ లోన్ మార్కెట్లో దక్షిణాది రాష్ట్రాలు 70 శాతానికి పైగా వాటాను కలిగి ఉండగా, తమిళనాడు ప్రథమ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానంలో ఉన్నాయి.