
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి హైకోర్టు నేటి ఉదయం 7.30కి తీర్పు వెలువరించనుంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) రీపోలింగ్ నిర్వహించిన నాలుగు వార్డులతో పాటు మిగతా అన్ని వార్డుల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలని పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ వివాదంపై హైకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో స్థానికంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.