Education
2029 నాటికి ఏపీలో మరో మూడు డీఎస్సీ నోటిఫికేషన్లు: మంత్రి లోకేశ్

2029 నాటికి ఏపీలో మరో మూడు డీఎస్సీ నోటిఫికేషన్లు: మంత్రి లోకేశ్

eenadu pratibha1h
THE BRIEF
1

ఏపీలో 2029వ సంవత్సరం లోపు మరో మూడు డీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేస్తామని మంత్రి నారా లోకేశ్ విజయవాడలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ప్రకటించారు.

2

గత ప్రభుత్వాల హయాంలో 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, సీఎం చంద్రబాబు నాయుడు గతంలో 14 డీఎస్సీలను నిర్వహించారని మంత్రి గుర్తు చేశారు.

3

ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా నైపుణ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను అందిపుచ్చుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు.