
ఈపీఎఫ్ఓ సెంట్రలైజ్డ్ డేటాబేస్ అప్గ్రేడ్ ప్రక్రియ వల్ల తెలంగాణలో 4.63 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్లో 3.29 లక్షల మంది పింఛనుదారులకు చెల్లింపుల్లో జాప్యం జరిగింది.
సాంకేతిక సమస్యలు తొలగిపోవడంతో శనివారం లేదా సోమవారం నాటికి పింఛను సొమ్ము ఖాతాల్లో జమ అవుతుందని ఈపీఎఫ్ఓ అధికారులు వెల్లడించారు.
ఈ ఆలస్యం కేవలం జులై నెలకు మాత్రమేనని, ఆగస్టు నుంచి పింఛన్లు యథాతథంగా సమయానికి అందుతాయని అధికారులు భరోసా ఇచ్చారు.