
విధులకు గైర్హాజరైన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి 70 మంది ప్రభుత్వ డాక్టర్లను డిస్మిస్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు ఈ తొలగింపు చర్యలు జరిగాయి.
నిబంధనలు ఉల్లంఘించి విధులకు గైర్హాజరవుతున్న మరో 193 మంది వైద్యులపై కూడా త్వరలో వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.