
ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించే పథకాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
పాలకొల్లులో మంగళవారం జరగనున్న ఆక్వా రైతుల సభలో మంత్రులు అచ్చన్నాయుడు, రవి కుమార్ పాల్గొని ఈ రాయితీని అధికారికంగా ప్రకటించనున్నారు.
గత ప్రభుత్వం నిబంధనల పేరుతో ఆక్వా రైతులకు సబ్సిడీని దగా చేసిందని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ రాయితీని అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.