
హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష అంకుర సంస్థ టేక్ మీ 2 స్పేస్, దేశీయంగా ప్రైవేటు రంగంలో తొలిసారిగా 'పవర్‌బ్యాంక్-50' అనే శాటిలైట్ బ్యాటరీని రూపొందించింది.
స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్‌లో వినియోగించిన ఈ బ్యాటరీ, భూమి నుంచి 450 కి.మీ. ఎత్తు కక్ష్యలో విజయవంతంగా పనిచేసింది.
380 గ్రాముల బరువున్న ఈ లిథియం అయాన్ బ్యాటరీ యూనిట్ 50 డబ్ల్యూహెచ్ ఎనర్జీని నిల్వ చేసుకుంటుంది, దీని ధర రూ.1,04,900.