సమీప గ్రామాలను మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో ఏకపక్షంగా విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
గ్రామాల విలీన ప్రక్రియ తమ తుది తీర్పునకు లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.