
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 3,000 స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) కేసులు నమోదయ్యాయి, దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
ముఖ్యమంత్రి రేఖా గుప్తా మంగళవారం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, నివారణ చర్యలు, వైద్య సదుపాయాలపై సమీక్షించారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ సింగ్ పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు, ఔషధాలు ఉన్నాయని తెలిపారు.