
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు.
హత్య జరిగి ఏడేళ్లు గడిచినా ఇప్పటికీ ఆయుధం దొరకలేదని, కేసులో రూ.కోట్ల మనీ ట్రయల్ మరియు పెద్ద కుట్ర కోణాలను వెలికితీయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ లేఖ ప్రతులను ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిలకు కూడా సునీతారెడ్డి పంపించారు.